Home చిత్తూరు వార్తలు Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి గరుడ సేవ.. భక్తులకు కన్నులపండుగ

Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి గరుడ సేవ.. భక్తులకు కన్నులపండుగ

1


Tirumala: పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా నిర్వహించారు టీటీడీ అధికారులు.

రాత్రి 7 గంటలకు మొదలైన ఈ సేవలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.

అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.